దుర్గగుడిలో తనిఖీలు: ఉపాలయాలకు తాళాలు
విజయవాడ: దుర్గ గుడి చైర్మన్ నారాయణ రెడ్డి అనుచిత ప్రవర్తనకు పూజారులు నిరసన వ్యక్తం చేశారు. నారాయణ రెడ్డి చర్యపై వారు దేవాలయం కార్యనిర్వాహక అధికారికి ఫిర్యాదు చేశారు. వినాయక, నటరాజ ఉపాలయాలు మూసేసి, తాళాలు వేశారు. ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులతో నారాయణ రెడ్డి తనిఖీలు నిర్వహించడంతో ఈ వివాదం తలెత్తింది.
ఆలయంలో పని చేస్తున్న 8 మంది అనధికార పూజారాలను నారాయణ రెడ్డి పంపించి వేశారు. సెక్యురిటీ గార్డులు గర్భగుడిలోకి ప్రవేశించినందుననే మూసేశామని, శుద్ధి చేసిన తర్వాత రేపు ఉదయం తెరుస్తామని పూజారులు చెప్పారు. గర్భగుడిలోకి ప్రవేశించిన సెక్యూరిటీ గార్డులపై చర్యలు తీసుకుంటానని చైర్మన్ నారాయణ రెడ్డి చెప్పారు.












Click it and Unblock the Notifications
