కరీంనగర్: ఆడపిల్లను కన్నందుకు ఓ భర్త భార్యను ఆస్పత్రిలోనే వదిలేసి వెళ్లిపోయిన సంఘటన కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం తిప్పాపూర్ గ్రామంలో జరిగింది. నరేందర్ అనే వ్యక్తికి రేణుకతో ఎనిమిదేళ్ల క్రితం పెళ్లయింది. మొదటిసారి రేణుకకు మగబిడ్డ పుట్టి చనిపోయాడు. రెండో కాన్పులో ఆడపిల్ల పుట్టింది. ఆ తర్వాత కూడా మళ్లీ రేణుకకు ఆడపిల్లనే పుట్టింది.
ఆడపిల్ల పుట్టడంతో కోపగించిన నరేందర్ భార్య రేణుకను ఆస్పత్రిలోనే వదిలేసి వెళ్లిపోయాడు. మగబిడ్డ పుడితేనే ఇంటికి రావాలంటూ చెప్పి అతను వెళ్లిపోయాడు. దీంతో రేణుక దిక్కుమొక్కు లేక ఆస్పత్రిలోనే వుండిపోయింది. కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.












Click it and Unblock the Notifications
