మావోయిస్టుల్లో తీవ్ర నిస్పృహ: స్వరణ్‌జిత్
వరంగల్: మావోయిస్టులు తీవ్ర నిస్పృహలో కొట్టుమిట్టాడుతున్నారని రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) స్వరణ్‌జిత్ సేన్ అన్నారు. మంగళవారంనాడు ఎపియస్‌పి కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్‌లో పాల్గొన్న ఆయన కొద్దిసేపు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాకెట్ లాంచర్లను వాడే సాంకేతిక పరిజ్ఞానం మావోయిస్టుల వద్ద లేదని ఆయన స్పష్టం చేశారు.
మావోయిస్టుల వద్ద 200 రాకెట్ లాంచర్లు ఉండి వుంటాయని ఆయన చెప్పారు. అడవుల్లో రాకెట్ లాంచర్లను మోస్తూ తిరగడం, వాటిని ప్రయోగించడం మావోయిస్టులకు సాధ్యం కాదని ఆయన అన్నారు. రాష్ట్రంలో పది ఎపియస్‌పి కమాండో శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, మహిళా కమాండో శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications