నీలోఫర్‌లో ఒకే రోజు నలుగురు పిల్లల మృతి
హైదరాబాద్: హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రిలో ఒకే రోజు నలుగురు పిల్లలు మరణించారు. మరణించిన ఒక పాప బంధువులు ఒక జూనియర్ డాక్టర్‌పై దాడి చేశారు. ఈ దాడికి సంబంధించి పోలీసులు తిరుపతయ్య అనే వ్యక్తిని అరెస్టు చేశారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లనే పిల్లలు మరణించారనే ఆందోళన వ్యక్తమవుతోంది.
తమకు భద్రత కల్పించే వరకు విధులకు హాజరు కారాదని నీలోఫర్ ఆస్పత్రి వైద్యులు నిర్ణయించుకున్నారు. జూనియర్ డాక్టర్‌పై ఒక వ్యక్తి చేయి చేసుకోవడం వల్ల తమకే కాక మిగతా రోగులకు కూడా ఇబ్బంది అని వైద్యులంటున్నారు. చిన్నారుల మృతికి సంబంధించి తమ నిర్లక్ష్యమేమీ లేదని వారంటన్నారు. అయితే తాను జూనియర్ డాక్టర్‌పై దాడి చేయలేదని తిరుపతయ్య అంటున్నాడు.












Click it and Unblock the Notifications
