ప్రధానిని చంపుతామని ఇ-మెయిల్ బెదిరింపు
త్రివేండ్రం: కేరళ పర్యటన సందర్భంగా ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను చంపుతామంటూ ఇ - మెయిల్ బెదిరింపులు వచ్చాయి. కేరళ రాష్ట్ర హోం శాఖ కార్యదర్శికి ఈ ఇ - మెయిల్ వచ్చింది. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ వచ్చే నెల 1వ తేదీన కేరళలో పర్యటించనున్నారు. ఆయన కేరళ రాష్ట్ర స్వర్ణోత్సావాల్లో పాల్గొంటారు. అయినప్పటికీ ప్రధాని పర్యటన యధావిధిగా వుంటుంది. అయితే భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. ఈ ఇ-మెయిల్‌కు సంబంధించి పోలీసులు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
కొచ్చిలోని ఒక సైబర్ కేఫ్ యజమానిని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. సైబర్ కేఫ్ కస్టమర్లయిన ఇద్దరు బాలురు శుక్రవారం ఉదయం తొమ్మిది, తొమ్మిదిన్నర గంటల మధ్య ఈ ఇ-మెయిల్ ఇచ్చినట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. కాగా సైబర్ కేఫ్ యజమాని మహిళ. పోలీసులు నిందితులను ప్రశ్నిస్తున్నారు. నిజంగానే ప్రధాని ప్రాణాలకు ముప్పు ఉందా, లేకుంటే సరదాకు వారు ఆ బెదిరింపు మెయిల్ ఇచ్చారా అనే విషయాన్ని తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇ- మెయిల్ ఇవ్వడం వెనక కుట్రను తెలుసుకోవడానికి సోదాలు జరుగుతున్నట్లు హోం శాఖ సహాయ మంతి ప్రకాష్ జైస్వాల్ కాన్పూర్‌లో చెప్పారు.












Click it and Unblock the Notifications
