తెలంగాణకు అధిష్ఠానం రెడీ: ఎమ్మెస్సార్
కరీంనగర్: తెలంగాణ రాష్ట్రం ఇస్తామనే నినాదంతో కరీంనగర్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో ప్రచారం చేయడానికి తమ కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానవర్గం ఆమోదించిందని రాష్ట్ర క్రీడలు, సాంస్కృతిక వ్యవహారాల మంత్రి ఎం. సత్యనారాయణ రావు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తామని ప్రకటిస్తున్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె. చంద్రశేఖరరావు కరీంనగర్‌లో పోటీ నుంచి తప్పుకోవాలని ఆయన సూచించారు.
తెలంగాణ విషయంలో అధిష్ఠానం తన నిర్ణయం మార్చుకుంటే తాను ఏ త్యాగానికైనా సిద్ధమేనని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెరాస అధ్యక్షుడిగా చంద్రశేఖరరావు ఉన్నంత కాలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
