తెలంగాణపై సోనియాకు సమయం కావాలి: వైయస్
హైదరాబాద్: తెలంగాణపై తమ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటారని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చెప్పారు. అందువల్లనే తెలంగాణ నిర్ణయాన్ని తాము సోనియాకు వదిలేశామని ఆయన శుక్రవారంనాడు ఒక కార్యక్రమంలో అన్నారు.తెలంగాణ రాష్ట్రం ఇస్తే దేశంలోని ఇతర ప్రాంతాల్లో ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటు ఉద్యమాలు ఊపందుకుంటాయనేది సోనియా భావన అని ఆయన అన్నారు.
పశ్చిమ బెంగాల్‌లో గూర్ఖాలాండ్, మహారాష్ట్రలో విదర్భ వంటి ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్లున్నాయని, వీటిన్నిటినీ పరిశీలించి తెలంగాణపై నిర్ణయం తీసుకోవడానికి సోనియాకు తగిన సమయం అవసరమని ఆయన అన్నారు. అందుకే తెలంగాణపై నిర్ణయం తీసుకునేందుకు సోనియాకు తగిన సమయం ఇచ్చామని ఆయన చెప్పారు. వెనకబడిన తెలంగాణతో పాటు ఇతర వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి తమ లక్ష్యమని సోనియా స్పష్టంగా చెబుతున్నారని ఆయన గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications
