ప్రధాని మహాత్ముల ఆత్మలకు ఘోష పెట్టారు: టిడిపి
హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని ప్రధాని డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని సర్ ఆర్థర్ కాటన్‌తో పోల్చడాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు నాగం జనార్దన్ రెడ్డి, రావుల చంద్రశేఖర రెడ్డి తదితరులు ఎద్దేవా చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోటలో జాతీయ రహదారి విస్తరణ పనులకు గురువారం శంకుస్థాపన చేసిన అనంతరం మన్మోహన్ సింగ్ ప్రసంగిస్తూ రాజశేఖర రెడ్డి ఆర్థర్ కాటన్‌తో పోల్చారు. మహాపురుషులతో రాజశేఖర రెడ్డిని పోల్చడం ఏ మాత్రం ఔచిత్యం కాదని తెలుగుదేశం పార్టీ నాయకులు శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశాల మేరకే మన్మోహన్ సింగ్ రాజశేఖర్ రెడ్డిని ఆర్థర్ కాటన్‌తో పోల్చారని వారు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న వేల కోట్ల రూపాయల కుంభకోణాలను సాక్ష్యాధారాలతో చెప్పినా ప్రధానికి కనిపించలేదా? అని వారు అడిగారు. రాజశేఖర రెడ్డిది దుర్యోధన పాలన అని వారన్నారు. దమ్ముంటే రాజశేఖర రెడ్డి ప్రభుత్వ అవినీతిపై సెంట్రల్ విజిలెన్స్ కమీషన్ చేత విచారణ జరిపించాలని వారు ప్రధానిని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications
