టెక్ మధు లొంగుబాటు రెండు రోజుల్లో: జానారెడ్డి
విజయవాడ: నక్సలైట్లకు అత్యాధునిక ఆయుధ సంపత్తిని సమకూర్చుతున్న టెక్ మధు ఆచూకీ తెలిసిందని హోంమంత్రి జానారెడ్డి కృష్ణాజిల్లా కైకలూరులో శుక్రవారం ఉదయం ప్రకటించారు. టెక్ మధు చాలా రోజుల క్రితమే పోలీసుల అదుపులో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. మధు లొంగుబాటుపై డిజిపి, హోంమంత్రి విభిన్న ప్రకటనలు చేసిన విషయం కూడా తెలిసిందే.
మధు రెండు రోజుల్లో పోలీసులకు లొంగిపోతాడని హోంమంత్రి నేడు చెప్పారు. మధు ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నాడని, అతని ద్వారా పోలీసులు విలువైన సమాచారాన్ని రాబడుతున్నారని తెలుస్తోంది. మధును తాను స్వయంగా పోలీసులకు అప్పగించానని అతని తల్లి టీవీ ఛానల్స్‌కు చెప్పారు. నక్సలైట్ల సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం సూచించిన మూడంచెల విధానాన్ని అనుసరిస్తున్నామని జానారెడ్డి నేడు చెప్పారు.












Click it and Unblock the Notifications
