ఇద్దరు దళ సభ్యులతో పాటు 13 మంది లొంగుబాటు
విశాఖపట్నం: మావోయిస్టులకు విశాఖపట్నంలో మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇద్దరు మావోయిస్టు దళ సభ్యులతో పాటు 11 మంది మిలీషియా సభ్యులు సోమవారం విశాఖపట్నం జిల్లా పోలీసు సూపరింటిండెంట్ మురళి ముందు లొంగిపోయారు. ఇద్దరు దళ సభ్యులు పేలుడు పదార్థాలను అమర్చడంలో మావోయిస్టులకు సహకరిస్తున్నారు.
లొంగిపోయిన నక్సలైట్లతో పాటు గ్రామస్థులందరికీ జి.కె. వీధి మండలం తీగలమెట్టలో పక్కా గృహాలు నిర్మించి ఇస్తామని ఎస్‌పి చెప్పారు. ప్రజలు తమ సమస్యలను విన్నవిస్తే తాము పరిష్కరించడానికి సిద్ధంగా వున్నామని ఆయన చెప్పారు. సమస్యల పరిష్కారానికి పాలనా యంత్రాంగమే ప్రజల వద్దకు వెళ్లాలని ఆయన అన్నారు. వేధింపులు భరించలేకనే తాము లొంగిపోయామని మిలీషియా సభ్యులు చెప్పారు.












Click it and Unblock the Notifications
