గంగూలీ అంతే: జహీర్, కుంబ్లే, జాఫర్‌కు చోటు
ముంబాయి: దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే భారత వన్డే సిరీస్ క్రికెట్ జట్టులో ఫాస్ట్ బౌలర్ జహీర్‌ఖాన్‌కు, సీనియర్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే, ఓపెనర్ వాసిం జాఫర్‌కు చోటు లభించింది. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో తలపడే 16 మంది ఆటగాళ్ల జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) సోమవారంనాడు ప్రకటించింది. యువరాజ్ సింగ్ స్థానంలో దినేష్ కార్తిక్‌కు చోటు లభించింది. అజిత్ అగార్కర్ స్థానంలో వి. ఆర్.వి. సింగ్‌కు చోటు దక్కింది. కాగా అజిత్ అగార్కర్‌కు నవంబర్ 1వ తేదీన ఫిట్నెస్ పరీక్ష జరుగుతుంది.
2007 ప్రపంచ కప్ జట్టు కెప్టెన్‌గా రాహుల్ ద్రావిడ్ పేరును సెలెక్షన్ కమిటీ చైర్మన్ దిలీప్ వెంగ్‌సర్కార్ ప్రకటించారు. దక్షిణాఫ్రికాకు వెళ్లే జట్టుకు గౌతమ్ గంభీర్‌కు చోటు కల్పించలేదు. అలాగే భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి కూడా మొండి చెయ్యే ఎదురైంది. దినేష్ మోంగియాకు జట్టులో స్థానం దొరికింది. దక్షిణాఫ్రికాలో భారత్ ఐదు వన్డేలు, మూడు టెస్టు మ్యాచ్‌లు, ఒక ట్వంటీ - ట్వంటీ మ్యాచ్ అడుతుంది. దేశంలో ప్రతిభ గల ఆటగాళ్ల కొరత వుందని వెంగ్‌సర్కార్ అన్నారు.
భారత జట్టు: రాహుల్ ద్రావిడ్ (కెప్టెన్), వీరేందర్ సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్, దినేష్ మోంగియా, వాసిం జాఫర్, సురేష్ రైనా, మొహ్మద్ కైఫ్, మునాఫ్ పటేల్, ఎస్. శ్రీశాంత్, జహీర్‌ఖాన్, అనిల్ కుంబ్లే, హర్బజన్ సింగ్, మహేంద్రసింగ్ ధోనీ, ఇర్ఫాన్ పఠాన్, అజిత్ అగార్కర్, దినేష్ కార్తిక్.












Click it and Unblock the Notifications
