మట్టూ కేసు: సంతోష్‌కుమర్ సింగ్‌కు మరణశిక్ష
న్యూఢిల్లీ: ఏడేళ్ల క్రితం జరిగిన ఢిల్లీ విశ్వవిద్యాలయం లా విద్యార్థిని ప్రియదర్శిని మట్టూపై అత్యాచారం, హత్య కేసులో సంతోష్ కుమార్ సింగ్‌కు ఢిల్లీ హైకోర్టు సోమవారంనాడు మరణశిక్ష ఖరారు చేసింది. సింగ్‌కు మరణశిక్ష విధించాలని కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) గట్టిగా వాదించింది. ప్రియదర్శిని మట్టూపై సంతోష్‌సింగ్ కుమార్ సింగ్ 1996 జనవరి 23వ తేదీన అత్యాచారం జరిపి ఆమెను హత్య చేశాడు.
ఈ కేసు అరుదైన కేసుల్లో అరుదైనదని, సింగ్ చేసిన నేరం కిరాతకమైందని, దారుణమైందని ప్రాసిక్యూషన్ తరఫున అడిషినల్ సొలిసిటర్ జనరల్ అమరేంద్ర శరణ్ జస్టిస్ సోధి, జస్టిస్ పి.కె. భాషిన్‌లతో కూడిన బెంచ్ ముందు వాదించారు. హత్య కిరాతకమైందని, అనాగరికమైందని 1999లో కింది కోర్టు కూడా అభిప్రాయపడిందని, నేరస్థుడికి మరణశిక్ష పడడం సబబుగా వుంటుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
