అనంతపురం వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఘెరావ్
అనంతపురం: తమపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ అనంతపురం వైద్య కళాశాల విద్యార్థులు సోమవారం ఆందోళనకు దిగారు. ప్రిన్సిపాల్ గదిలోకి వెళ్లి ఆయనను ఘెరావ్ చేశారు. పరీక్షలకు 15 మంది విద్యార్థులను అనర్హులను చేస్తూ ప్రిన్సిపాల్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రిన్సిపాల్‌ను బదిలీ చేయాలని వారు డిమాండ్ చేశారు.
విద్యార్థుల అందోళనకు అసంతృప్తి చెందిన ప్రిన్సిపాల్ తాను విధులు నిర్వహించబోనని అలిగారు. తాము విద్యార్థుల సమస్యలపై పోరాడుతున్నామని కక్ష గట్టిన ప్రిన్సిపాల్ తమను పరీక్షలకు అనర్హులుగా ప్రకటించారని విద్యార్థులు విమర్శిస్తున్నారు.












Click it and Unblock the Notifications
