ఏడు గంటల కరెంట్‌ కూడా కష్టమే: వైయస్‌

హైదరాబాద్‌: వ్యవసాయానికి ఏడు గంటలు విద్యుత్‌ సరఫరా చేయడమే కష్టంగా వుందని ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర రెడ్డి అన్నారు. అయితే వ్యవసాయానికి ఏడు గంటలు విద్యుత్‌ను అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇతర రాష్ట్రాల నుంచి తాము విద్యుత్‌ను కొంటూనే వున్నామని, ఇంకా అంతకు మించి కొనడానికి దేశంలో ఎక్కడా విద్యుచ్ఛక్తి దొరకడం లేదని ఆయన అన్నారు. విద్యుత్‌ సరఫరాపై ఆయన సోమవారం ఉన్నతాధికారులతో సమీక్షించారు.

ముందు గృహావసరాలకు, పరిశ్రమలకు విద్యుత్‌ కోత విధిస్తామని ఆయన చెప్పారు. విద్యుత్‌ కోత విధించే సమయాలను ముందే ప్రజలకు చెప్పాలని ఆయన అధికారులను ఆదేశించారు. రబీలో రైతులు ఆరుతడి పంటలు వేసుకునేలా చైతన్యపరచాలని ఆయన అధికారులకు సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+