ఫ్లై ఓవర్ ఘటన: గామన్ ఇండియాపై కేసులు
న్యూఢిల్లీ: ఫ్లై ఓవర్ కూలిన ఘటనకు సంబంధించి నిర్మాణ కంపెనీ గామన్ ఇండియాపై పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ కేసు నమోదు చేశారు. కాగా, ఫ్లై ఓవర్ ఘటనపై అధ్యయనానికి ఐదుగురు నిపుణులతో ఒక కమిటీని వేశారు. ఈ కమిటీలో రోడ్లు భవనాల శాఖ, జెఎన్ టియు, ఐఐటి చెన్నై, నాక్, ఉస్మానియా విశ్వవిద్యాలయాలకు చెందిన నిపుణులు ఉంటారు. కూలిన వరకే కాకుండా మొత్తం ఫ్లై ఓవర్ మొత్తంపై నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఆదేశించారు. మూడు రోజుల్లోగా ఈ కమిటీ నివేదిక సమర్పిస్తుంది.
ఫ్లై ఓవర్ శిధిలాలను మొత్తం తొలగించారు. శిథిలాల కింద చిక్కుకున్న ఒక శవాన్ని వెలికి తీశారు. వాహనాలను కూడా పూర్తిగా బయటకు తీశారు. కమిటీ నివేదిక వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని గ్రేటర్ హైదరాబాద్ కమీషనర్ శర్మ సోమవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఫ్లై ఓవర్ కూలిపోవడానికి కారకులపై చర్యలు తీసుకునే విషయంలో రాజీ పడబోమని మంత్రి ముఖేష్ చెప్పారు. స్టాప్ హోల్డర్లు ఒక వైపు వంగాయని, సాయిల్ లూజ్ గా ఉండడం వల్ల ఇది జరిగిందని, అయితే మట్టి లక్షణాన్ని నిర్ధారించుకోవాల్సిన బాధ్యత కాంట్రాక్టరుదేనని శర్మ వివరించారు.












Click it and Unblock the Notifications