వెంకట్ ను అరెస్టు చేయాలి: బాబు డిమాండ్
హైదరాబాద్: ప్రశాంత్ రెడ్డి మృతి ఘటనలో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు కె. కేశవరావు కుమారుడు వెంకట్ ను వెంటనే అరెస్టు చేయాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు డిమాండు చేశారు. కేశవరావు రాజీనామా నాటకం ఆడుతున్నారని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు.
హైదరాబాదులో ఫ్లై ఓవర్ కూలిపోయిన సంఘటనపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని ప్రాజెక్టుల పనులను నిలిపేసి క్వాలిటీ ఆడిట్ నిర్వహించాలని ఆయన డిమాండు చేశారు. నాసిరకంగా పనులు జరుగుతున్నాయని, నాణ్యతా ప్రమాణాల యంత్రాంగమే లేకుండా పోయిందని, నాసికరం పనుల వల్ల రాష్ట్రంలో ఫ్లై ఓవర్ ప్రమాదాల వంటివి మరిన్ని జరిగే అవకాశం ఉందని, దీని నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ముడుపుల కోసం కాంగ్రెసు నాయకులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యారని, ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అవినీతి మితిమీరిపోయిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications