పంజాగుట్ట ఫ్లైవోవర్ కూలి నలుగురి మృతి
హైదరాబాద్: హైదరాబాద్ నగరం నడిబొడ్డులో ఘోరం జరిగింది. అత్యంత కీలకమైన పంజగుట్ట చౌరస్తాలో కొత్తగా నిర్మిస్తున్న ఫ్లై వోవర్ లో ఒక్ భాగం కూలిపోవడంతో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. సూపర్ స్ట్రక్చర్ కాంక్రీట్ దిమ్మలు ఆ దారిలో వెళ్తున్న వాహనాలు కూలడంతో అవి నుజ్జు నుజ్జు అయ్యాయి.
ఈ సంఘటన గురించి తెలుసుకున వెంటనే గ్యామన్ ఇండియా కాంట్రాక్టర్ పరారయ్యాడు. ప్రమాదంలో ఎక్కువ మంది మరణించలేదని తెలుసుకున్న తర్వాతే అతనుఅందుబాటులోకి వచ్చాడు. తప్పు తమది కాదని, వాటర్ బోర్డుదని గ్యామన్ ఇండియా కాంట్రాక్టర్లు బుకాయిస్తున్నారు. రాష్ట్రంలో "ముఖ్య" నేత బావమరిది అండదండలతో గ్యామన్ ఇండియా కాంట్రాక్టర్లు దాదాపు వెయ్యికోట్ల రూపాయల కాంట్రాక్టులను చేజిక్కించుకుని, సబ్ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించింది.












Click it and Unblock the Notifications