పిసిసి అధ్యక్ష పదవికి కేశవరావు రాజీనామా
హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్ష పదవికి డాక్టర్ కె. కేశవరావు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధిష్ఠానానికి పంపినట్లు తెలుస్తోంది. తన రాజీనామా లేఖను ఆయన పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి, పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ చార్జీ దిగ్విజయ్ సింగ్ కు ఫాక్స్ ద్వారా పంపినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రకటించున్నారు. అధిష్ఠానం మనోగతాన్ని అర్థం చేసుకున్న ఆయన రాజీనామా చేసినట్లు భావిస్తున్నారు.
ప్రశాంత్ రెడ్డిని తన కొడుకు వెంకట్ కాల్చి చంపాడనే ఆరోపణ నేపథ్యంలో సంఘటనపై సోనియాకు కేశవరావు ఒక నివేదికను పంపారు. ఈ ఘటనపై కేశవరావు మొదట ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డితో మాట్లాడారు. పిసిసి పదవికి రాజీనామా చేయడమే ఉత్తమమని ముఖ్యమంత్రి సూచించినట్లు సమాచారం. రాజీనామా చేయకపోతే పార్టీ, ప్రభుత్వం ఈ సమస్యనుంచి బయట పడడం కష్టమని ముఖ్యమంత్రి చెప్పినట్లు తెలుస్తోంది. ప్రశాంత్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని కేశవరావు ఆదివారం సాయంత్రం హడావిడిగా ప్రకటించారు.












Click it and Unblock the Notifications