బాంబు బెదిరింపులు చేసిన బాలికకు మొట్టికాయలు
విజయవాడ: పాఠశాలల్లో బాంబులున్నాయంటూ తప్పుడు కాల్స్ చేసిన దుర్గ అనే ఏడో తరగతి విద్యార్థినిని పోలీసులు గట్టిగా మందలించి వదిలేశారు. బాంబులున్నాయంటూ విజయవాడలో వివిధ ప్రాంతాల్లో ఉన్న మూడు పాఠశాలలకు మంగళవారంనాడు పోన్ కాల్స్ వచ్చాయి. దీంతో విద్యార్థులు పాఠశాలల నుంచి బయటకు పరుగులు తీశారు.
పోలీసులు హుటాహుటిన చేరుకుని తనిఖీలు నిర్వహించారు. బాంబులున్నట్లు వచ్చిన సమాచారం ఉత్తదేనని తనిఖీల్లో వెల్లడైంది. దాంతో బాంబులున్నాయంటూ వచ్చిన ఫోను కాల్ ను పరిశీలించారు. దుర్గ అనే బాలిక ఆ ఫోన్ చేసినట్లు తేలింది. దీంతో పోలీసులు ఆ బాలికను అదుపులోకి తీసుకున్నారు. బడి ఎగగొట్టానికే ఆ 12 ఏళ్ల బాలిక తప్పుడు ఫోన్ కాల్స్ చేసిందని విచారణలో తేలింది.












Click it and Unblock the Notifications
