నల్లగొండ జిల్లాలో రెండు భారీ డంప్ ల స్వాధీనం
నల్లగొండ: నల్లగొండ జిల్లాలో పోలీసులు రెండు మావోయిస్టుల భారీ మందుగుండు సామగ్రి డంప్ లను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని దేవలమ్మనాగారం సమీపంలో ఒక భారీ డంపును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే చందంపేట మండలంలో మరో డంప్ ను స్వాధీనం చేసుకున్నారు.
20 కిలోలేసి గల ఆరు క్లైమోర్ మైన్సును, 3 మందుపాతరలను, జిలిటెన్ స్టిక్సును, వైర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను జిల్లా పోలీసు సూపరింటిండెంట్ విజయకుమార్ గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వెల్లడించారు. లొంగిపోయిన 11 మంది నక్సలైట్లకు ఆయన రివార్డులను ప్రదానం చేశారు.












Click it and Unblock the Notifications