ల్యాంకోహిల్స్ కు భూకేటాయింపుపై స్టే
హైదరాబాద్: హైదరాబాదులోని ఖరీదైన ప్రాంతం మణికొండలో ల్యాంకోహిల్స్ కు ప్రభుత్వం జరిపిన భూకేటాయింపుపై రాష్ట్ర హైకోర్టు గురువారం స్టే ఇచ్చింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఏ విధమైన నిర్మాణాలు చేపట్టకూడదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మణికొండలో ల్యాంకోహిల్స్ కే కాకుండా కొన్ని ఐటి కంపెనీలకు ప్రభుత్వం 17 వందల ఎకరాలు కేటాయించింది. ఈ కేటాయింపును సవాల్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు రెహ్మాన్ పిటిషన్ దాఖలు చేశారు.
మణికొండలో ల్యాంకోహిల్స్ కోట్ల రూపాయలకు 120 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. ఆ భూమిలో ల్యాంకోహిల్స్ నివాస సముదాయాల నిర్మాణానికి పూనుకుంది. ఈ భూమి కేటాయింపుపై హైకోర్టు స్టే ఇవ్వడం వల్ల తమకొచ్చే నష్టమేమీ లేదనే ధీమాతో ల్యాంకోహిల్స్ ఉంది. ప్రభుత్వానికి డబ్బు చెల్లించి తాము భూమిని కొలుగోలు చేశామని, తమకు భూమిని అప్పగించే పని ప్రభుత్వమే చూసుకుంటుందని కంపెనీ యాజమాన్యం అంటోంది.












Click it and Unblock the Notifications