సిఐడి అధికారులు బలవంతంగా చెప్పించారు: వెంకట్ న్యాయవాది
ప్రశాంత్ రెడ్డిని తానే కాల్చిచంపినట్టు వెంకట్ వాంగ్మూలం ఇవ్వకుండా సిఐడి పోలీస్ అధికారులే దీనిని కల్పించారని నిందితుడు వెంకట్ తరపు న్యాయవాది వెంకటేష్ బలంగా వాదిస్తున్నారు. బహుషా సిఐడి పోలీసులే బలవంతంగా వెంకట్ చేతే ఇలా చెప్పించి ఉండవచ్చని న్యాయవాది అంటున్నారు. ముఖ్యంగా సిఐడి అధికారి శ్రీనివాసే దీనిని సృష్టించి ఉండవచ్చని న్యాయవాది వెంకటేష్ అంటున్నారు.
ఇదిలా ఉంటే సిఐఢి అధికారులు నిజాయితీగా చేసిన కృషి అభినందనీయమని మృతుడు ప్రశాంత్ రెడ్డి భార్య విలాసిని పేర్కొంది. ఈ కేసు వియషంలో మీడియా చేసిన కృషి కూడా అద్భుతమని విలాసిని సోదరుడు వినాయకరెడ్డి పేర్కొన్నారు. ఆత్మహత్య కాదని తాము మొదటి నుంచి చెబుతున్నామని ఆయన అన్నారు.
ఇదిలా ఉంటే సిఐడి వాంగ్మూలం టీవీ ఛానెళ్లకు ఎలా దొరికిందనేది పెద్ద ప్రశ్న. వెంకట్ వాంగ్మూలంలో ఏమి చెప్పినా ఆ వాంగ్మూలాన్ని లీక్ చేయకూడదు. సిఐడి అధికారులు కేవలం కోర్టులోనే వాంగ్మూలాన్ని ప్రవేశపెట్టాల్సిఉంటుంది. దీని వెనకాల రాజకీయ కుట్రేమైనా జరిగిందా అనే కోణంలో విశ్లేషకులు చూస్తున్నారు. కేసు కోర్టులో ఉండగా మీడియా కల్పించుకోవడం చట్టవ్యతిరేకమని వారు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications