ముస్లిం రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు నోటీసులు
న్యూఢిల్లీ: ముస్లింలకు ఏ ప్రాతిపదిక మీద రిజర్వేషన్లు కల్పించారని సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రశ్నించింది. ముస్లిం రిజర్వేషన్లపై ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు సోమవారంనాడు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది.
ముస్లిం రిజర్వేషన్లపై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది. ముస్లిం రిజర్వేషన్ల కల్పనలో క్రీమీలేయర్ ను ఏ మేరకు పాటించారని కూడా కోర్టు ప్రభుత్వాన్ని అడిగింది. ఈ నెల 30వ తేదీ నుంచి ఎంబిబియస్ లో అడ్మిషన్ల కోసం కౌన్సిలింగ్ జరగనుంది. ఈ లోగానే సుప్రీంకోర్టు తీర్పు వెలువడుతుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications