8 మంది అమ్మాయిల కిడ్నాప్
కర్నూలు: కర్నూలు జిల్లాలో ఎనిమిది విద్యార్థినులు బుధవారం ఉదయం అపహరణకు గురయ్యారు. రెండు టాటా సుమోల్లో వచ్చిన దుండగులు అమ్మాయిలను అపహరించుకుపోయారు. దుండగులు బారి నుంచి ఇద్దరు విద్యార్థినులు తప్పించుకున్నట్లు సమాచారం. అపహరణకు గురైన అమ్మాయిలంతా 10, 12 ఏళ్ల మధ్య వయస్సు గలవారే.
విద్యార్థినులను అపహరించుకుని దుండగులు నందికొట్కూరు నుంచి నంద్యాల వైపు వెళ్లినట్లు భావిస్తున్నారు. అపహరణకు గురైన అమ్మాయిలు నవనంది పాఠశాలకు చెందినవారు. కిడ్నాపర్లకోసం పోలీసులు అన్ని ప్రాంతాలను అప్రమత్తం చేశారు.
అపహరణకు గురైన 8 మంది అమ్మాయిల్లో ఇద్దరు తప్పించుకుని పారిపోయి వచ్చారు. వారు నేరుగా పాఠశాలకు చేరుకుని విషయం తెలియజేశారు. తాము పెన్నులు కొనుక్కోవడానికి వెళ్లినప్పుడు మత్తు మందు చల్లి తమను అపహరించుకుని పోయారని తప్పించుకుని వచ్చిన బాలికలు చెప్పారు. దుండగులు టీ తాగడానికి వాహనాన్ని నిలిపినప్పుడు తాము తప్పించుకున్నామని వారు చెప్పారు.












Click it and Unblock the Notifications
