మరో మృతదేహం: మావోయిస్టు నేతదని భావన
విశాఖపట్నం: బుధవారంనాడు ఎదురు కాల్పులు జరిగిన విశాఖపట్నం జిల్లా జి. మాడుగుల మండలంలోని అటవీ ప్రాంతంలో మరో మృతదేహం కనిపించింది. ఆ మృతదేహం మావోయిస్టు నాయకుడదై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. స్థానికులు మృతదేహాన్ని చూసి పోలీసులకు తెలియజేశారు.
బుధవారం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మరణించినట్లు జిల్లా ఎస్పీ ప్రకటించిన విషయం తెలిసిందే. మృతుల్లో ముగ్గురు మహిళా నక్సలైట్లు ఉన్నారు. అయితే గురువారంనాడు సంఘటనా స్థలంలో మరో మృతదేహం బయటపడింది. దీంతో మావోయిస్టు మృతుల సంఖ్య ఐదుకు పెరిగింది.












Click it and Unblock the Notifications
