ఆలంపూర్ ఎస్ బిహెచ్ ఎదుట బాంబు పేలుళ్లు
మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్ బిహెచ్) ఎదుట శుక్రవారం బాంబు పేలుళ్లు సంభవించాయి. అకస్మాత్తుగా జరిగిన ఈ పేలుళ్లతో కలకలం రేగింది. పేలుళ్లు సంభవించిన వెంటనే బ్యాంకు సిబ్బంది ఖాతాదారులను బ్యాంకులోనే నిలువరించి తాళాలు వేశారు.
బ్యాంకు దోపిడీకి పాల్పడడానికి దుండగులు ఈ బ్యాంకు పేల్చారనే మాట వినిపిస్తోంది. ఈ ఏడాది మార్చిలో జిల్లాలోని ఒక గ్రామంలో జరిగిన హత్య కేసులో నిందితుడు వెంకటేశ్వర్లు ఆ సమయంలో బ్యాంకులో ఉన్నాడు. వెంకటేశ్వర్లును హత్య చేయడానికి ప్రత్యర్థులు అక్కడికి చేరుకుని ఉంటారని, వారు తెచ్చిన బాంబులే పేలి ఉంటాయనే మాట కూడా వినిపిస్తోంది. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితులను అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications
