సొమ్మసిల్లి పడిపోయిన మహిళా ఎమ్మెల్యే
చిత్తూరు: తనకు జరిగిన అవమానంపై జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేసే సమయంలో ఉద్వేగానికి లోనై పలమనేరు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలు లలితకుమారి సొమ్మసిల్లి పడిపోయారు. ఇటీవల జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో తనకు జరిగిన అవమానంపై ఆమె శుక్రవారంనాడు జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. లలితకుమారికి జరిగిన అవమానంపై పార్లమెంటు సభ్యుడు ఆదికేశవులు నాయుడు నేతృత్వంలో తెలుగుదేశం నాయకులు కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. ఈ సమయంలో కలెక్టరుతో తెలుగుదేశం నాయకులు వివాదానికి దిగారు.
వివాదం సమయంలో ఉద్వేగానికి లోనైన లలితకుమారి సొమ్మసిల్లి కుర్చీలో కూలబడిపోయారు. వేదికపై ఉంటే ప్రభుత్వ అవినీతిని ఎండగడతాననే భయంతోనే తనను లేకుండా చేసి అవమానించారని లలితకుమారి విమర్శించారు. ప్రజల సమస్యలను వినిపించకూడదనే దురుద్దేశంతోనే తనను అవమానించారని ఆమె అన్నారు. ఆ కార్యక్రమం సందర్భంగా లలితకుమారి సిఐ కాళ్లు పట్టుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.












Click it and Unblock the Notifications
