భార్యను చంపిన భర్త, అతన్ని చంపిన మరుదులు
ఖమ్మం: ఖమ్మం బైపాస్ రోడ్డులో శుక్రవారంనాడు జంట హత్యలు జరిగాయి. భార్యను భర్త హత్య చేయగా ఆగ్రహించిన బావమరదులు అతన్ని హత్య చేశారు. సంచార జాతికి చెందిన రాము, శాంతిల వివాహం మూడు నెలల క్రితం జరిగింది. అప్పటి నుంచి రాము తాగి వచ్చి శాంతితో గొడవ పడడం పరిపాటి అయింది. గత రాత్రి కూడా భార్యాభర్తలు గొడవ పడ్డారు. దాంతో శాంతి పుట్టింటికి వెళ్లిపోయింది.
రాము శుక్రవారంనాడు శాంతి పుట్టింటికి వెళ్లాడు. ఇద్దరు తిరిగి తమ ఇంటికి వస్తూ నాగార్జున సాగర్ కాలువ మళ్లీ గొడవ పడ్డారు. ఈ సమయంలో రాము రాయితో మోది శాంతిని హత్య చేశాడు. దాంతో ఆగ్రహించిన శాంతి సోదరులు రామును హత్య చేశారు.












Click it and Unblock the Notifications
