సోమశిల నీటిలో పడవ మునక: 3గురు మృతి
కడప: కడప జిల్లా చుక్కాయపల్లి గ్రామం వద్ద సోమశిల బ్యాక్ వాటరులో పడవ మునిగి బుధవారం ఉదయం ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఈ ప్రమాదం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 11 మంది ప్రయాణిస్తున్నారు. గత 2, 3 నెలలుగా కురుస్తున్న వర్షాల వల్ల సోమశిల బ్యాక్ వాటర్ బాగా పెరిగింది.
సోమశిలకు సంబంధించి ముంపు ప్రమాదం ఉన్న గ్రామాలు 105 దాకా ఉన్నాయి. ఆ గ్రామవాసులకు పునరావాస సౌకర్యం కల్పించలేదు. ఐదారు గ్రామాల ప్రజలకు పరిహారం కూడా చెల్లించలేదు. గతంలో గట్లువరం గ్రామంలో ఒక మహిళ కూడా ఈ బ్యాక్ వాటరులో మునిగి చనిపోయింది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం లక్ష రూపాయలేసి ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.












Click it and Unblock the Notifications
