వైయస్ పై మేధా పాట్కర్ నిప్పులు
కాకినాడ: పశ్చిమ బెంగాల్ లోని నందిగ్రామ్ పరిస్థితులే తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నాయని మేధా పాట్కర్ వ్యాఖ్యానించారు. తూర్పు గోదావరి జిల్లా ప్రత్యేక ఆర్థిక మండలి స్థలాన్ని సందర్శించేందుకు ఆమె బుధవారం ఉదయం అన్నవరం చేరుకున్నారు. ప్రత్యేక ఆర్థిక మండళ్లు దోపిడీ మండళ్లుగా మారాయని ఆమె విమర్శించారు.
ప్రత్యేక ఆర్థిక మండళ్లకు భూముల సేకరణ విషయంలో ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశాలను కూడా ఖాతరు చేయడం లేదని, మాగాణి భూములను సేకరిస్తున్నారని ఆమె అన్నారు. దేశవ్యాప్తంగా ప్రత్యేక ఆర్థిక మండళ్లకు వ్యతిరేకంగా పోరాడుతామని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications
