ప్రియుడితో కలిసి ఇద్దరు బిడ్డలను చంపిన స్త్రి?
అనంతపురం: పాఠశాలకని వెళ్లిన అక్కాచెల్లెళ్లు చెరువులో శవాలై తేలారు. ఈ సంఘటన అనంతపురం జిల్లాలో జరిగింది పాఠశాలకని వెళ్లిన తమ పిల్లలు మల్లికా బేగం, ఇర్షాబేగం తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు అన్వేషణ ప్రారంభించారు. ఇద్దరు పిల్లలు సింగనమల చెరువులో శవాలై కనిపించారు. దాంతో తల్లిదండ్రులు తారాబేగం, షేక్ మహ్మద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే ఆ పిల్లలు హత్యకు గురయ్యారని, ఆ హత్యకు తారాబేగం వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. తారాబేగం తన ప్రియుడు మంజునాథ్ తో కలిసి పిల్లలను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో పోలీసులు మంజునాథ్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే తనకే పాపం తెలియదని మంజునాథ్ అంటున్నాడు.












Click it and Unblock the Notifications
