చిరంజీవితో తృతీయ ప్రత్యామ్నాయం: రాఘవులు
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసుతో పొత్తు పెట్టుకోవడం అసాధ్యమని సిపియం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు అన్నారు. మధ్యంతర ఎన్నికలు వస్తే అందుకు బాధ్యత కాంగ్రెసు పార్టీదేనని, ప్రజలు ఆ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయంగా ఉండాలన్నదే తమ ఉద్దేశమని ఆయన చెప్పారు.
వచ్చే శాసనసభ ఎన్నికలనాటికి మూడో ప్రత్యామ్యాయాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన చెప్పారు. సనీ నటుడు చిరంజీవి, లోక్ సత్తా నాయకుడు జయప్రకాశ్ నారాయణలతో తృతీయ ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునే విషయంపై మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నకు ఆయన నుంచి సరైన సమాధానం రాలేదు. రాఘవులు ప్రకటనను బట్టి రాష్ట్రంలో కొత్త రాజకీయ సమీకరణలకు దారి తీయవచ్చునని అర్థం చేసుకోవడానికి వీలవుతోంది.












Click it and Unblock the Notifications
