వైయస్ పై చీటింగ్ కేసు పెట్టాలి: ఎర్రంనాయుడు
విజయనగరం: హామీలతో ప్రజలను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిపై చీటింగ్ కేసు పెట్టాలని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ (టిడిపిపి) నాయకుడు కె. ఎర్రంనాయుడు డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రాజశేఖర రెడ్డి కొత్త హామీలను ఇస్తున్నారని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి మూడున్నర లక్షల రూపాయలు ఖర్చయ్యే హామీలు ఇచ్చారని ఆయన చెప్పారు.
రెండు లక్షల ఉద్యోగాలు, పేదలకు ఇళ్లు వంటి ఎన్నో హామీలను ఇచ్చిన రాజశేఖర రెడ్డి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మరిన్ని హామీలు ఇస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ ను ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఆయన అన్నారు. ఎన్నికల ప్రణాళికను తుచ తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంటుందని, వాటిని అమలు చేయకుండానే రాజశేఖర రెడ్డి కొత్త హామీలు ఇస్తున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
