రేపు హైదరాబాదుకు ఆర్మీ మేజర్ భౌతికకాయం
హైదరాబాద్: కాశ్మీరులో మరణించిన హైదరాబాదుకు చెందిన ఆర్మీ మేజర్ ఆర్. వినయ్ భౌతిక కాయం రేపు ఇక్కడికి చేరుకుంటుంది. ప్రత్యర్థులు జరిపిన దాడిలో వినయ్ మంగళవారంనాడు మరణించారు. ఆయనతో పాటు ఒక జవాన్ గాయపడ్డాడు. వినయ్ హైదరాబాదులోని రాజేంద్రనగర్ కు చెందినవాడు.
వినయ్ 1994లో ఆర్మీలో చేరారు. ఆర్మీ మేజరుగా ప్రమోషన్ పొందారు. మరో రెండు నెలల్లో వివాహం జరగాల్సిన స్థితిలో అతను దేశం కోసం ప్రాణత్యాగం చేశాడు. బెంగుళూరుకు చెందిన అమ్మాయితో అతని వివాహం ఖరారైంది. వినయ్ తండ్రి ప్రభాకర్ కేంద్ర ప్రభుత్వోద్యోగం చేసి పదవీ విరమణ చేశారు.












Click it and Unblock the Notifications
