రాఘవులుది పూటకో మాట: జి.ఎస్. రావు
హైదరాబాద్: సిపియం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు పూటకో మాట మాట్లాడుతున్నారని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) తాత్కాలిక అధ్యక్షుడు జి.ఎస్. రావు విమర్శించారు. రాష్ట్రంలో మూడో ప్రత్యామ్యాయం గురించి రకరకాలుగా మాట్లాడుతున్నారని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
తాము సిపియంతో కలిసి సాగుదామనే అనుకుంటున్నామని, ఈ విషయంలో తేల్చుకోవాల్సింది సిపియమ్మేనని ఆయన అన్నారు. మూడో ప్రత్యామ్నాయంలో ఎవరెవరుంటారనే విషయంలో రాఘవులుకు స్పష్టత లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications