విజయవాడ మేయర్, కార్పోరేటర్ల రాజీనామా
విజయవాడ: తమ తీర్మానాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం జీవోలు జారీ చేయడాన్ని నిరసిస్తూ విజయవాడ మేయర్ మల్లికా బేగంతో పాటు కాంగ్రెస్ కార్పోరేటర్లు గురువారం రాజీనామాలు చేశారు. తాము కౌన్సిల్ లో చేసిన తీర్మానాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం మూడు జీవోలు జారీ చేసిందని వారు చెప్పారు. కరకట్టలపైవారిని తొలగించాలని, ఇతర అంశాలకు సంబంధించి ఈ జీవోలు జారీ అయ్యాయని వారు చెప్పారు. తమ డిమాండ్లను మున్సిపల్ మంత్రి కోనేరు రంగారావుకు వినిపించడానికి వారు హైదరాబాద్ వెళ్లారు.
మేయర్, కార్పోరేటర్ల చర్యను విజయవాడ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ సమర్థించారు. మంత్రులకు, శాసనసభ్యులకు తెలియకుండా ప్రభుత్వం జారీ చేయడం తగదని ఆయన అన్నారు. జీవోల జారీ అధికారుల తప్పిదమేనని ఆయన అన్నారు. కౌన్సిల్ తీర్మానాలను పట్టించుకోకుండా జీవోలు జారీ చేయడాన్ని శాసనసభ్యుడు రాధాకృష్ణ విమర్శించారు.












Click it and Unblock the Notifications