హైదరాబాదులో 4 ఏళ్లలో ఆటోలకు స్వస్తి
హైదరాబాద్: వచ్చే నాలుగేళ్లలో హైదరాబాద్ నగరంలో ఆటోలను తొలగించాలని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఆదేశించారు. వాటి స్థానంలో ట్యాక్సీలను ప్రవేశపెట్టాలని, ఇందుకు సంబంధించి ప్రణాళికను రూపొందించాలని ఆయన రవాణా శాఖాధికారులను ఆదేశించారు. ఆటోలకు డిజిటల్ మీటర్ల అమరిక, రవాణా నిబంధనల ఉల్లంఘన అంశాలపై ఆయన గురువారం రవాణా శాఖాధికారులతో సమీక్ష నిర్వహించారు.
నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆటోలను తొలగించి ట్యాక్సీలను ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ట్యాక్సీల కొనుగోలుకు పావలా వడ్డీకే రుణాలు ఇప్పించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ విషయమై తాను బ్యాంకర్లతో మాట్లాడుతానని ఆయన చెప్పారు. ట్యాక్సీ కొనుగోలుకు అవసరమయ్యే నాలుగు లక్షల రూపాయలు రుణంగా ఇప్పించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ విషయంపై ఈ నెల 24వ తేదీన ఆటో యూనియన్లతో చర్చలు జరుపుతారు.












Click it and Unblock the Notifications
