మంత్రి బొత్సా మాతో వస్తే నిరూపిస్తాం: అఖిల పక్షం
హైదరాబాద్: గృహ నిర్మాణ శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ తమతో వస్తే ఇందిరమ్మ గృహాల్లో అక్రమాలను నిరూపిస్తామని అఖిల పక్ష నాయకులు సవాల్ చేశారు. ఇందరిమ్మ గృహాలపై సిపియం సోమవారంనాడు అఖిల పక్ష నాయకులతో రౌండు టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో కడియం శ్రీహరి (తెలుగుదేశం), నాయని నర్సింహా రెడ్డి (తెలంగాణ రాష్ట్ర సమితి) తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ గృహాల్లో అక్రమాలపై న్యాయవిచారణ జరిపించాలని అఖిల పక్ష నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా స్థాయిల్లో మానిటరింగ్ కమిటీలు వేయాలని కూడా వారు డిమాండ్ చేశారు. ఇందిరమ్మ గృహాల్లో అక్రమాలపై సభా సంఘం వేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇది కాంగ్రెస్ పథకంగా మారిందని వారు విమర్శించారు. ప్రభుత్వం ముందుకు రాకపోతే తామే ఇందిరమ్మ పథకం అమలు జరుగుతున్న గ్రామాల్లో మానిటరింగ్ కమిటీలు వేస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications