బస్సుల మధ్య నలిగి ముగ్గురు మృతి
తిరుపతి: చిత్తూరు జిల్లా రేణిగుంట మండల కేంద్రంలో సోమవారం జరిగిన ఘోర ప్రమాదంలో ముగ్గురు మరణించారు. ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడి తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుల్లో ఇద్దరు కూలీలు, ఒక భక్తుడు ఉన్నారు.
బస్ స్టాండులో ఒక ప్రైవేట్ బస్సు ప్రవేశిస్తుండగా ఆ వెనకే వచ్చిన టూరిస్టు బస్సు అదుపు తప్పి బస్సు ఢీకొట్టింది. ఈ రెండు బస్సుల మధ్య నలుగురు నలుగురు వ్యక్తులు నలిగిపోయారు. వారిలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.












Click it and Unblock the Notifications