ఇందిరమ్మ ఇళ్ల అవినీతిని అంగీకరించిన రోశయ్య
హైదరాబాద్: ఇందిరమ్మ గృహాల నిర్మాణ పథకం అమలులో అవకతవకలు నిజమేనని ఆర్థిక మంత్రి కె. రోశయ్య అంగీకరించారు. పెద్ద యెత్తున పథకం అమలు జరుగుతున్నప్పుడు అవకతవకలు జరుగుతుంటాయని, అంత మాత్రాన పథకాన్ని రద్దు చేయడం కుదరదని ఆయన సోమవారంనాడు మీడియా ప్రతినిధులతో అన్నారు. అవకతవకలకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. మధ్యంతర ఎన్నికలు వస్తే ఆ పాపం కాంగ్రెసుదేనని చంద్రబాబు అన్నారని, అప్పుడు ఎదురుగాలి వీస్తుందని తెలిసి ఆ విధంగా అన్నారని, ఇప్పుడేమో ఎన్నికల నుంచి కాంగ్రెస్ దూరం పోయిందని విమర్శిస్తున్నారని, ఈ విధమైన ధోరణి చంద్రబాబుకు సరి కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications