వెంకట్ భార్యను అరెస్టు చేసే వరకు పోరు: విలాసిని
హైదరాబాద్: తన భర్త మృతి కేసులో పిసిసి మాజీ అధ్యక్షుడు కె. కేశవరావు కుమారుడు వెంకట్ భార్య దివ్యను, పనిమనిషిని అరెస్టు చేయాలని రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రశాంత్ రెడ్డి భార్య విలాసిని డిమాండ్ చేశారు. వారిని అరెస్టు చేసే వరకు తన పోరాటం సాగుతుందని ఆమె చెప్పారు. మానవ హక్కుల కమీషన్ ముందు ఆమె సోమవారంనాడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
ప్రభుత్వ అండదండలతో కేసును నీరు గార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె విమర్శించారు. కేసు విచారణను మానవ హక్కుల కమీషన్ ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది. తన భర్త మృతి కేసులో న్యాయం చేయాలని గతంలో విలాసిని మానవ హక్కుల కమీషనుకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై మానవ హక్కుల కమిషన్ విచారణ చేపట్టింది.












Click it and Unblock the Notifications