ఎపిపియస్సీ గ్రూప్-1,2 పరీక్షల్లో మార్పులు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (ఎపిపియస్సీ) గ్రూప్ - 1, గ్రూప్ -2 పరీక్షల సిలబస్ ను మార్చారు. పరీక్షా విధానంలో సమూల మార్పులు చేశారు. గత యాభై ఏళ్లలో సిలబస్ మార్చడం ఇదే మొదటిసారి. ఆప్షనల్స్ ను తొలగించారు. నూతన పరీక్షా విధానాన్ని ఎపిపియస్సీ చైర్మన్ వెంకట్రామి రెడ్డి గురువారంనాడు వివరించారు. ఇంటర్వ్యూ మార్కులను 90 నుంచి 75కు తగ్గించారు. ప్రిలిమినరీ పరీక్షా విధానంలో మాత్రం మార్పులు చేయలేదు.
మెయిన్స్ లో ఐదు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరుకు 150 మార్కులుంటాయి. ఆంగ్ల భాషకు సంబంధించి పేపరు ప్రాధాన్యాన్ని తగ్గించారు. ఈ పేపరులో అభ్యర్థి పాసయితే చాలు. ఇంటర్వ్యూకు ఎంపిక చేయడానికి ఈ మార్కులను ప్రాతిపదికగా తీసుకోరు. ఇంటర్వ్యూకు అభ్యర్థులను 1: 50 నిష్పత్తి ప్రకారం పిలుస్తారు.












Click it and Unblock the Notifications
