ఆర్టీసి బస్సులు పెంచుతాం: దినేష్ రెడ్డి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎపియస్ ఆర్టీసి) బస్సుల చార్జీలు పెరగనున్నాయి. ఆర్టీసి మేనేజింగ్ డైరెక్టర్ దినేష్ రెడ్డి గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే పల్లె వెలుగు బస్సులను మాత్రం ఈ పెంపు నుంచి మినహాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ బస్సుల్లో గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలు ఎక్కువగా ప్రయాణిస్తుంటారు. ఈ బస్సులు 10 వేల 200 దాకా ఉన్నాయి. చార్జీల పెంపుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. చార్జీలు ఎంత పెంచాలనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ఈ నెలాఖరు నాటికి నిర్ణయం తీసుకుంటామని, లూబ్రికేట్ ఆయిల్ వంటి వాటి ధరలు పెరగడం వల్ల బస్సు చార్జీలు పెంచక తప్పడం లేదని ఆయన అన్నారు. చార్జీలు 2003లో పెరిగాయని ఆయన చెప్పారు. గడిచిన ఆరు నెలల కాలంలో ఆర్టీసి 123 కోట్ల రూపాయల లాభం వచ్చిందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
