ఇది వైయస్, బాబుల నాటకం: విద్యాసాగర్
కరీంనగర్: ఆస్తులపై ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి, ప్రతిపక్షనాయకుడు నారా చంద్రబాబు నాయుడు చేసుకుంటున్న ఆరోపణలు నాటకమని భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకుడు సిహెచ్. విద్యాసాగరరావు వ్యాఖ్యానించారు. ఆస్తులపై విచారణ జరిపించడానికి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి పదవికి, చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడి పదవికి రాజీనామా చేయాలని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో డిమాండ్ చేశారు.
అధికారంలో ఉన్నప్పుడు ఎవరి చేత కమీషన్ వేసినా రాజశేఖరరెడ్డిపై గానీ, చంద్రబాబుపై గానీ సమాచారం ఇవ్వడానికి అధికారులు ముందుకు రారని, అందువల్ల వారు అధికారంలో ఉండగా విచారణ జరిపించడం వల్ల ప్రయోజనం ఉండదని ఆయన అన్నారు. వారు రాజీనామా చేస్తే సిబిఐ చేత విచారణ జరిపించవచ్చునని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
