కర్నూలు జిల్లాలో కిడ్నాపైన బాలుడి హత్య
కర్నూలు: ఐదు రోజుల క్రితం కర్నూలు జిల్లాలోని ఉలిందకొండ పోలీసు స్టేషన్ పరిధిలో అపహరకణకు గురైన బాలుడు హత్యకు గురయ్యాడు. కొల్లంపల్లి తండాలోని తౌర్యా నాయక్ కుమారుడు ఆరేళ్ల విష్ణు నాయక్ ఇంటి వద్ద ఆడుకుంటుండగా దుండగులు కిడ్నాప్ చేశారు.
బాలుడిని వదిలేందుకు కిడ్నాపర్లు 10 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. పోలీసులు నిఘా పెట్టి డబ్బులు డిమాండు చేస్తున్న రవీంద్రనాయక్ ను అదుపులోకి తీసుకున్నారు. బాలుడు మూడు రోజుల క్రితమే హత్యకు గురైనట్లు విచారణలో పోలీసులు తెలుసుకున్నారు. తౌర్యానాయక్ తో ఉన్న వ్యక్తి గత కక్షలే బాలుడి హత్యకు కారణమని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications
