బాబును కలిసిన అఖిల పక్ష రైతు సంఘాల నేతలు
హైదరాబాద్: వరికి మద్దతు ధరను డిమాండ్ చేస్తూ ఈ నెల 24వ తేదీన ఆందోళన చేపట్టనున్నట్లు అఖిల రైతు సంఘాల నాయకులు చెప్పారు. ఈ సందర్భంగా బస్సులను, రైళ్లను రాష్ట్రవ్యాప్తంగా ఆపేస్తామని వారు మీడియా ప్రతినిధులతో చెప్పారు.
వరికి మద్దతు ధర కోసం తాము చేస్తున్న ఆందోళనను బలపరచాలని కోరుతూ అఖిల పక్ష రైతు సంఘాల ప్రతినిధులు గురువారంనాడు ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడుకు, సిపియం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులుకు వినతిపత్రాలు సమర్పించారు. శరద్ పవార్ చేసిన ప్రకటనను రైతు సంఘాల నాయకులు ఖండించారు. ఆందోళనకు పూర్తి మద్దతు ఇస్తామని చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications
