తస్మాత్ జాగ్రత్త: వైయస్, బాబులకు కెసిఆర్ హెచ్చరిక
వరంగల్: వచ్చే ఎన్నికల్లో రాజకీయ సంక్షోభం సృష్టించి కీలక పాత్ర పోషిస్తామని, తమ తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యాన్ని సాధిస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు అన్నారు. వరంగల్లులో ఆయన గురువారంనాడు భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఓట్ల కోసమే ముఖ్యమంత్రి రెండు రూపాయల కిలో బియ్యం పథకాన్ని ప్రకటించారని ఆయన విమర్శించారు.
ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి, తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఒటర్లను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్సిస్తూ తస్మాత్ జాగ్రత్త అని వారిని హచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మద్యనిషేధాన్ని విధించే విషయంపై పార్టీలో చర్చిస్తున్నామని ఆయన చెప్పారు. ఆంధ్రా లిక్కర్ లాబీని ప్రోత్సహించడానికే గీత కార్మికుల నోట్లో మట్టి కొడుతున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణలోని వరి రైతులకు 20 శాతం అధికంగా మద్దతు ధర ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications
