వైయస్ ను తప్పు పట్టిన సిపిఐ నారాయణ
ఒంగోలు: వరికి మద్దతు ధర విషయంలో ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి తీరును సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ తప్పు పట్టారు. వరికి వేయి రూపాయల మద్దతు ధర ప్రకటింపజేయడానికి కేంద్రంపై ఒత్తిడి తెస్తామని అనడం సరి కాదని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
వరికి మద్దతు ధర కోసం కేంద్రంపై ఒత్తిడి తేవడానికి అఖిల పక్ష బృందాన్ని ఢిల్లీకి తీసికెళ్లాలని, దానికి ముఖ్యమంత్రి నేతృత్వం వహించాలని తాము అడుగుతున్నామని, అలా కాకుండా ఒంటరిగానే కేంద్రంపై ఒత్తిడి తెస్తామని ముఖ్యమంత్రి అనడం సరి కాదని ఆయన అన్నారు. వరికి మద్దతు ధరపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ చేసిన ప్రకటనను ఆయన ఖండించారు. ఇందిరమ్మ గృహాల పథకం అమలుకు యూనిటుకు లక్ష రూపాయలు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications
