వెంకట్ ను జైలుకు తరలించిన పోలీసులు
హైదరాబాద్: రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రశాంత్ రెడ్డి మృతి కేసులో నిందితుడు, పిసిసి మాజీ అధ్యక్షుడు కె. కేశవరావు తనయుడు వెంకట్ ను పోలీసులు నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) నుంచి జైలుకు తరలించారు. నిమ్స్ నుంచి మీడియా కంట పడకుండా అతన్ని జైలుకు తరలించారు. అతనికి హైకోర్టు బుధవారంనాడు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. వెంకట్ గురువారంనాడు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.
వారానికో సారి సిఐడి పోలీసుల ముందు హాజరు కావాలని షరతు విధిస్తూ 25 వేల రూపాయల పూచీకత్తుపై హైకోర్టు వెంకట్ కు బెయిల్ మంజూరు చేసింది. వెంకట్ ఇంటిలో జరిగిన కాల్పుల్లో ప్రశాంత్ రెడ్డి మరణించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications
