వరికి మద్దతు ధర కోసం ఆందోళన ఉద్రిక్తం
హైదరాబాద్: వరికి కనీస మద్దతు ధర వెయ్యి రూపాయలు ఇవ్వాలని కోరుతూ రైతు సంఘాలు, అఖిల పక్ష నేతలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. అసెంబ్లీ ఆవరణలో మహాత్మాగాంధీ విగ్రహం ముందు శనివారం ఈ ఆందోళన జరిగింది. వివిధ పార్టీల నాయకులను, వ్యసాయ సంఘాల నేతలను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. దీనితో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వరికి వెయ్యి రూపాయల మద్దతు ధర ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని నాయకులు ఆవేశంగా ప్రకటించారు.












Click it and Unblock the Notifications
